: నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈ నెల 25 నుంచి 27 వరకు మధ్యంతర బెయిల్ ను హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న నిమ్మగడ్డ గడువు నేటితో ముగియనుంది. దాంతో, మరో మూడు రోజుల బెయిల్ ఇవ్వాలంటూ నిమ్మగడ్డ నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కొంతకాలం నుంచి ఆయన రిమాండు ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.