: తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరంలేదు: ఆమోస్
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం కానీ, ఏకాభిప్రాయం కానీ అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ తెలిపారు. పార్లమెంటులో కేంద్రం నేరుగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్న ఆమోస్..1956 నవంబర్ 1న జరిగిన హైదరాబాదు-ఆంధ్ర విలీనాన్ని రద్దు చేయాలని డిమాండు చేశారు. అయితే, ఈ అంశంపై అసెంబ్లీ, పార్లమెంటు లో చర్చ అవసరం లేదన్నారు. తెలంగాణ ఆదాయంతోనే హైదరాబాదు అభివృద్ధి చెందుతోందన్నారు.