: అంజయ్యలా ప్రకటన చేసిన బొత్స: యనమల
రాష్ట్రంలో 1038 పంచాయతీలను ఏకగ్రీవంగా గెలిచామంటూ పీసీసీ అధ్యక్షడు బొత్స చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. యనమల నేడు హైదారాబాద్ లో మాట్లాడుతూ, అప్పట్లో 11 ఏళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేసిన అంజయ్య, ఎన్నికల తరువాత, గెలిచినవాళ్లంతా కాంగ్రెస్ వాళ్లేనని ప్రకటించి అపహాస్యంపాలైన రీతిలో బొత్స ప్రకటన ఉందని గేలి చేశారు.