: సంజయ్ దత్ పిటిషన్ పై నేడు సుప్రీం తీర్పు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించనుంది. 1993 ముంబై బాంబు పేలుళ్లలో కేసులో తనకు విధించిన ఐదు సంవత్సరాల జైలుశిక్షను ఒకసారి సమీక్షించాలని విజ్ఞప్తి చేస్తూ సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఐదేళ్ల శిక్షలో సంజూ ఇప్పటికే ఏడాదిన్నర శిక్ష అనుభవించగా మిగతా శిక్షను అనుభవించేందుకు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.