: అమర్త్యసేన్ గారూ పని చూస్కోండి: బీజేపీ కౌంటర్
మోడీని ప్రధానిగా అంగీకరించలేనని వ్యాఖ్యానించిన ప్రఖ్యాత ఆర్ధికవేత్త అమర్త్యసేన్ పై బీజేపీ విమర్శలకు దిగింది. అమర్త్యసేన్ ఓ జీనియస్ అని అభివర్ణిస్తూ, ఆయన తన పనేదో తాను చూసుకోవాలని బీజేపీ నేత కీర్తి ఆజాద్ హితవు పలికారు. ఆజాద్ ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడుతూ, మోడీ ప్రధానిగా రావాలంటూ దేశం యావత్తూ కోరుకుంటుంటే, అమర్త్యసేన్ ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కాగా, అమర్త్యసేన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్ సమర్థించారు. పలు ప్రపంచదేశాలకు మోడీని ప్రధానిగా చూడడం ఇష్టంలేదన్నదే ఆ వ్యాఖ్యల సారాంశం అని పాల్ పేర్కొన్నారు. నోబెల్ విజేత అమర్త్యసేన్ వ్యాఖ్యలతోనైనా బీజేపీ కళ్ళు తెరవాలని ఆయన సూచించారు.