: ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్


తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈసారి స్థానిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం కనిపించింది. వృద్ధులను కుర్చీలమీద తీసుకువచ్చి మరీ ఓట్లేయించారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రధానంగా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఘర్షణలు జరిగాయి. ఒంటి గంట సమయానికి క్యూలో ఉన్నవారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తామని, అనంతరం వచ్చిన వారిని అనుమతించేది లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కాగా అదిలాబాద్ జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 4 పంచాయతీలకు గుర్తులు తారుమారవడం, అభ్యర్థుల పేర్లు గల్లంతవ్వడం వంటి కారణాలతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News