: హోటల్ బిల్లులో వ్యంగ్యాస్త్రాలు.. రెస్టారెంటు మూసివేత!


యూపీఏ అవినీతిని వ్యతిరేకిస్తూ బిల్లులపై సరదాగా ప్రింటు చేయించిన వ్యాఖ్యలు ఓ రెస్టారెంటు మూసివేతకు కారణమయ్యాయి. ముంబై స్థానిక దినపత్రిక 'ముంబై డైలీ' కథనం ప్రకారం.. బోర్గేస్ రోడ్ లో అదితి ప్యూర్ వెజ్ రెస్టారెంటు ఉంది. ఆ రెస్టారెంటు యజమాని, కస్టమర్లకు జారీ చేసే బిల్లులపై 'యూపీఏ ప్రభుత్వ విధానాల ప్రకారం లంచం తినడం తినడం అనేది చాలా అవసరం' అంటూ 2జీ, కోల్, సీడబ్ల్యూజి కుంభకోణాలను ప్రస్తావించాడు. అంతేగాకుండా, 'ఏసీ రెస్టారెంట్లలో తిండి తినడం అంటే విలాసవంతం' అని ముద్రించాడు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు రెస్టారెంటు ఎదుట ధర్నా నిర్వహించారు.

వెంటనే హోటల్ మూసివేయాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సహా వారు డిమాండు చేశారు. అంతేగాక, రెస్టారెంటు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసి పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. ఆ వెంటనే యాజమానిపై నాన్ కాగ్నిజబుల్ పిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఐపిసి సెక్షన్ 501 కింద పరువు నష్టం కేసు కూడా నమోదు చేశారు. ఏసీ రెస్టారెంట్లపై సేవా పన్నును కొన్ని రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News