: రగిలిన చైతన్యం.. పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు
ఎన్నికల సమయంలోనే గ్రామాలను సందర్శిస్తూ, అనంతరం అక్కడి వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధుల తీరుపై పల్లెల్లో చైతన్యం రగులుతోంది. వారి తీరుకు నిరసనగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు గ్రామంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు తమను పట్టించుకోని నాయకులకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. సమర్ధులైన అభ్యర్ధులు కరవైనప్పుడు ఎవరికో ఒకరికి ఓట్లు వేయడం దండగ అంటూ పోలింగును బహిష్కరించారు.