: బీజేపీ, ఆర్జేడి రహస్య ఒప్పందం చేసుకున్నాయి: సీఎం నితీశ్
బీహార్ లోని సరన్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మొదటిసారి స్పందించారు. ఈ ఘటన నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ, ఆర్జేడీ పార్టీలు చాటుమాటు ఒప్పందం చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భోజనంలో పురుగుల మందు కలిసిందని ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించిందన్న నితీశ్.. దీని వెనుక కుట్ర ఉందని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురితో నిన్న జరిపిన సమావేశంలో అభిప్రాయపడ్డారు.
అందుకే బుధ్ గయ, చాప్రా ఘటన తర్వాత రెండు పార్టీలు రెండు రోజుల బందును ప్రకటించాయని నితీశ్ ఆరోపించారు. బీహార్ లో కమలనాథులు అధికారాన్ని కోల్పోవటం, ఎన్ డీఏ నుంచి జేడీ(యూ) బయటికి రావడంతో తీవ్రంగా కలత చెందారన్నారు. కాబట్టే, ప్రభుత్వంపై అలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.