: చంద్రగిరిలో మంత్రి గల్లా అరుణ తీరుపై ఆందోళన
చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలింగు కేంద్రం వద్ద మంత్రి గల్లా అరుణకుమారి హడావుడి సృష్టించారు. పోలింగు కేంద్రానికి తన అనుచరులతో వచ్చి హల్ చల్ చేశారు. దీనిపై ఇతర పార్టీల అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా మంత్రి గల్లా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.