: దేవుడిదే భారం అంటున్న ఢిల్లీ సీఎం
ఢిల్లీని గత రెండ్రోజులుగా అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలపై సీఎం షీలా దీక్షిత్ స్పందించారు. ఈ రోజు కురిసిన వర్షానికి అక్కడి ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో.. ప్రజలను దేవుడే కాపాడాలంటూ దీక్షిత్ మేడమ్ ప్రవచించారు. భగవంతుణ్ణి ప్రార్థించాలంటూ ప్రజలకు సూచించారు. నిన్న కురిసిన వర్షానికి తేరుకుంటున్న ఢిల్లీ నగరాన్ని ఈ మధ్యాహ్నం కురిసిన కుంభవృష్టి కుదిపేసింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నిజాముద్దీన్ బ్రిడ్జి, ఆశ్రమ్, ప్రగతి మైదాన్, మధురా రోడ్ తదితర ప్రాంతాలు జలమయ్యాయి.