: తెలంగాణను ఛత్తీస్ గఢ్ తో పోల్చిన కావూరి
తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో ఏమి జరుగుతుందో, ఇక్కడా అదే జరుగుతుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఛత్తీస్ గఢ్ లో ప్రతిరోజూ మావోయిస్టుల కార్యకలాపాల గురించి వింటూనే ఉన్నామన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ ను విభజించిన తర్వాత పరిస్థితులు ఎలా తయారయ్యాయో తెలిసిన విషయమేనన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, కావూరి సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.