: రెండేళ్లలో 93 వేల మందిని హతమార్చిన సిరియా సైన్యం
సిరియాలో గత రెండేళ్లుగా సాగుతున్న సంక్షోభంలో ఇప్పటివరకు 93 వేల మంది సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కాగా, సిరియా రాజధాని డమాస్కస్ లో గత 24 గంటల్లో 75 మంది తిరుగుబాటుదారులను సైన్యం హతమార్చిందని ఆందోళనకారులు తెలిపారు. రాజధాని నగరాన్ని కైవసం చేసుకునే దిశగా ఆందోళనకారులు నగరంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నం చేయడంతో సైన్యం వీరిని హతమార్చింది.