: వార్న్.. ఇక స్వంత పనులు చక్కబెట్టుకుంటాడట!


టెస్టుల్లో 708 వికెట్లు, 3 వేలకు పైగా పరుగులు సాధించిన ఆసీస్ మొనగాడు షేన్ వార్న్.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ టీ20 క్రికెట్ ఆడుతున్న ఈ లెగ్ స్పిన్ లెజెండ్ తాజా ప్రకటనతో అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ అయినట్టే. మెల్ బోర్న్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార వ్యవహారాలను, క్రికెట్ కామెంటరీ విధులను నిర్వర్తించడంతో పాటు కుటుంబానికి తగిన సమయం కేటాయించేందుకే ఆటకు పూర్తిస్థాయిలో వీడ్కోలు చెబుతున్నట్టు వివరించాడు.

బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్న్ 2007లో టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు సారథ్యం వహించాడు. వార్న్ కెప్టెన్సీలో రాయల్స్ ఐపీఎల్ తొలి సీజన్ విజేతగా అవతరించింది. కాగా, వార్న్ తాజా రిటైర్మెంటు నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్టు మెల్ బోర్న్ స్టార్స్ ఫ్రాంచైజీ సీఈవో క్లింట్ కూపర్ చెప్పారు.

  • Loading...

More Telugu News