: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కోర్ కమిటీకి లేఖ రాస్తా: బైరెడ్డి
రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులందరికీ లేఖ రాస్తానని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర విభజనకు కౌంట్ డౌన్ మొదలైందన్న ఆయన, విభజనతో కాంగ్రెస్ బయటపడాలనుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి సరిగా లేనందువల్లే, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ పూనుకుంటోందని విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఏదేమైనా, తమకు ప్రత్యేక సీమ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, లేకుంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.