: సైనా@ రూ.71 లక్షలు
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) వేలంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ను హైదరాబాద్ హాట్ షాట్స్ స్వంతం చేసుకుంది. ఆమెకు వేలంలో రూ.71 లక్షల ధర లభించింది. ఇక ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు లీ ఛాంగ్ వీ (ముంబయి మాస్టర్స్)కి రూ.80 లక్షల ధర పలికింది.
ఇతర భారత క్రీడాకారులు పారుపల్లి కశ్యప్ (బంగా బీట్స్)కు రూ.44 లక్షలు, జ్వాలా గుత్తా (ఢిల్లీ స్మాషర్స్) కు రూ.18 లక్షలు, పివి సింధు (లక్నో వారియర్స్)కు రూ.47 లక్షలు ధర పలికింది.