: విండీస్ పై పాక్ సునాయాస విజయం
వెస్టిండీస్ పై పాకిస్తాన్ మరోమారు విజయం సాధించింది. సెయింట్ లూసియానాలో జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 49 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 261 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శామ్యూల్స్(106), క్రిస్ గేల్(30) కుదురుగా ఆడారు. సిమ్మన్స్ మెరుపు వేగంతో 44 బంతుల్లో 46 పరుగులు రాబట్టుకున్నాడు. వర్షం కారణంగా, డక్ వర్త్-లూయిస్ విధానం ప్రకారం పాకిస్తాన్ విజయలక్ష్యాన్ని 31 ఓవర్లకు 189 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి, ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. హఫీజ్ (59), కెప్టెన్ మిస్బావుల్ హక్ (53 నాటౌట్)పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ లో పాక్ 2-1తో ఆధిక్యం సంపాదించింది. ఆఖరి వన్డే ఎల్లుండి గ్రాస్ ఐలెట్ లో జరగనుంది. ఈ సిరీస్ లో తొలి వన్డే పాక్ గెలవగా, రెండోది విండీస్ చేజిక్కించుకుంది. మూడో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.