: మోడీ సభకు వెళ్లాలంటే పేరు నమోదు తప్పనిసరి


ఆగస్టు 11న హైదరాబాదులోని ఎల్బీస్టేడియంలో జరిగే నరేంద్ర మోడీ 'నవభారత యువభేరీ' కార్యక్రమానికి హాజరు కావాలనుకునేవారు తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, నగరంలోని బీజేపీ కార్యాలయంలో స్వయంగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ప్రవేశరుసుం 5 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఉత్తరాఖండ్ వరద బాధితులకు విరాళంగా అందిస్తారు. అయితే, దీనిపై విమర్శలు రావడంతో ఉచితంగా కూడా పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆన్ లైన్లో www.modifyap.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News