: ఎదుగుదలకు తోడ్పడే కోడిగుడ్డు


కోడిగుడ్డును ఎదిగే పిల్లలకు పెడితే బాగా ఆరోగ్యంగా ఎదుగుతారట. అంతేకాదు ఇప్పటి వరకూ కోడిగుడ్డు తినడం వల్ల అధికంగా కొవ్వు పేరుకునే ప్రమాదం ఉందని భావించే వారి నోటికి కూడా శాస్త్రవేత్తలు తాళం తీస్తున్నారు. కోడిగుడ్డు తినడానికి, కొవ్వు పెరగడానికి సంబంధం లేదని, గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరగడం ఉండదని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో కనుగొన్నారు.

గ్రనడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కౌమార దశలో ఉండేవారు గుడ్డు తినడం వల్ల వారిలో కొవ్వు పెరిగి తర్వాత హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే దానికి అవకాశం ఉందా? అనే విషయంపై అధ్యయనం చేశారు. గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతారని, అయితే సంతృప్త కొవ్వులు ఉండే మాంసం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటుందేకానీ, గుడ్డులో ఉండే కొవ్వుల వల్ల హృదయనాళ సంబంధ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉండదని తాము నిర్వహించిన పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అల్బర్టో సోరియానో మాట్లాడుతూ వారానికి ఏడుకంటే తక్కువ గుడ్లు తీసుకున్న వారిలో కొవ్వులు పెరిగే ప్రమాదం తక్కువగా ఉందని తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. గుడ్లు తక్కువ ధరకు లభించినా కూడా వాటిలో విలువైన ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని, అవి కౌమారదశలో ఉండేవారి ఎదుగుదలకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News