: సేవా కార్యక్రమాలతోనే మానవ జన్మకు సార్థకత: రోశయ్య


సేవా కార్యక్రమాలతోనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆర్యవైశ్య సంఘం నిర్మించిన కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. తమిళనాడు నుంచి హెలీకాప్టర్లో వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నేతలు, ఆర్యవైశ్య సంఘనాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నతంగా ఉన్న వ్యక్తులు పేదలను ఆదుకునేందుకు ముందుండాలని కోరారు. అప్పుడే ఉన్నతమైన జీవితం లభిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News