: టీఆర్ఎస్ నేత వినోద్ సహా 40 మందిపై కేసు నమోదు
టీఆర్ఎస్ నేత వినోద్ సహా 40 మందిపై వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉండగా సమావేశం నిర్వహించకూడదు. ప్రజాప్రతినిధిగా పని చేసిన వినోద్ కు ఆ విషయం తెలిసినా సమావేశం నిర్వహించారని పోలీసుల ఆరోపణ.