: ఉగ్రవాదులు విరుచుకుపడతారు జాగ్రత్త: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఉగ్రవాదులు ఏదో ఒక రకంగా విరుచుకుపడే అవకాశముంది జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలంటూ దేశంలోని పలు నగరాలకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆ నగరాల వివరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతీ ఉన్నాయి. ఈ నగరాల్లో ఏదో ఒక రకంగా విధ్యంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచించుకున్నారని, విమానాలను హైజాక్ చేసి దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. కాగా కొద్ది రోజుల క్రితం కోల్ కతా లో పట్టు బడ్డ తీవ్రవాది గోదావరి జిల్లాల్లో కల్లోలం సృష్టించనున్నట్టు తెలిపాడు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ లోనే ఉగ్రవాదులు రెండు లక్ష్యాలు నిర్ధేశించుకున్నట్టు అర్ధమవుతోంది.