: 'విభజన ప్రాంతాల మధ్యే కానీ మనుషుల మధ్య కాదు'


రాష్ట్ర విభజన అంటే ప్రాంతాల మధ్య విభజనే తప్ప మనుషుల మధ్య కాదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సివిల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన సమావేశంలో పలువురు తమ వాణిని వినిపించారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు లేకుండా విడిపోవడం అవసరమని పౌరహక్కుల నేత హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు, సత్సంబంధాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే హైదరాబాద్ లో ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. విభజనకు సమయం ఆసన్నమైందని ఇప్పుడు అన్ని ప్రాంతాలు, రాజకీయపార్టీల నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News