: రజనీకి అదిరిపోయే పాటను అంకితమిస్తున్న షారూఖ్


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తమిళ నటశిఖరం రజనీ కాంత్ కు ఓ పాటను అంకితమిస్తున్నాడు. ఆగస్టు 9 న రిలీజ్ కి సిద్దమైన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాకు అనుబంధంగా ఆ పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట కోసం 5 రోజుల క్రితం సింగర్ హనీ సింగ్, టీసిరీస్ అధినేత భూషన్ కుమార్... షారూఖ్ ను సంప్రదించగా వారి ప్రతిపాదనకు షారూఖ్ పచ్చజెండా ఊపాడు. అంతే కాకుండా, ఆయన దీపికను కూడా ఒప్పించాడు. స్వతహాగానే దక్షణాది అమ్మాయైన దీపికా పదుకునే రజనీ సర్ సాంగ్ అనగానే ఎగిరి గెంతేసి ఒప్పుకుందట. 'అయినా రజనీ సర్ కి ఫాన్ కానిదెవరు? నేనే ఆయనకు పెద్ద అభిమానిని' అంటున్నాడు షారూక్. 'తలైవార్ లుంగీ డాన్స్' పేరుతో ఆ పాట అభిమానులను అలరించనుంది.

  • Loading...

More Telugu News