: హాకీ ఇండియాలో హాకీ హైదరాబాద్ కు చోటు
హాకీ ఇండియా, హకీ హైదరాబాద్ ను అసోసియేట్ మెంబర్ గా చేర్చుకుంది. దీంతో ఇకపై హాకీ ఇండియా నిర్వహించే అన్ని రకాల జాతీయ పోటీలలో హాకీ హైదరాబాద్ పాల్గొనే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ చేరికతో హాకీ ఇండియాలో అసోసియేట్ సభ్యుల సంఖ్య 15కు చేరుకుంది.