: నివాసయోగ్యమా? కాదా? తెలుసుకోవడానికే మార్స్ మిషన్: రాధాకృష్ణన్


గొప్ప కోసం కాదు, అర్థవంతమైన పరిశోధన కోసమే మార్స్ మిషన్ చేపట్టామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. మరో మూడు నెలల్లో అంగారకుడిపైకి ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ ఈ రోజు బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. "గొప్ప కోసం ఈ పరిశోధన చేపట్టలేదు. మార్స్ అన్వేషణకు శాస్త్రీయ పరమైన ప్రాధాన్యం ఉంది. అరుణ గ్రహం భవిష్యత్ నివాస గ్రహం కావచ్చని అందరూ మాట్లాడుకుంటున్నారు. 20, 30 ఏళ్లలో ఇది సాధ్యమే" అని రాధాకృష్ణన్ చెప్పారు.

"మార్స్ కు సంబంధించి ఆసక్తికరమైన ప్రశ్న.. నివాసయోగ్యమేనా? కనుక మీథేన్ ఉందా? లేదా? తెలుసుకోవాలి. ఇది జీవశాస్త్ర సంబంధమైనది. కనుక అరుణుడిపైకి ప్రయోగించే గ్రహంలో మీథేన్ సెన్సర్, ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రో మీటర్ ప్రవేశపెడుతున్నాం. వీటివల్ల ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది" అని రాధాకృష్ణన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇంతేసి ఖర్చు పెడుతున్నారంటూ వస్తున్న విమర్శలకు రాధాకృష్ణన్ తన వివరణతో సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News