: భారత్ లోకి మళ్లీ చొచ్చుకు వచ్చిన చైనా దళాలు


చైనా దళాలు స్వల్పకాలంలోనే మళ్లీ భారత సరిహద్దుల్లోకి చొరబడ్డాయి. 50 చైనా దళాలు లడక్ లోని వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల సైనిక దళాలు తమ తమ ప్రాంతాల్లో ఫ్లాగ్ డ్రిల్ నిర్వహించాయని, అనంతరం చైనా దళాలు వెనక్కి వెళ్లిపోయినట్లుగా చెప్పాయి. ఇది పోయిన బుధవారం జరిగింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితి తనకు తెలియదని ప్రకటించారు. ఏప్రిల్ 15న చైనా సైనికులు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 10 కిలోమీటర్ల మేర లోపలకు చొచ్చుకు వచ్చి చాలా రోజుల తర్వాత నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News