: బాంబులతో దద్దరిల్లిన ఇరాక్ రాజధాని... 33 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్ధాద్ బాంబు దాడులతో దద్దరిల్లింది. బాగ్ధాద్ లోని వాణిజ్య ప్రాంతాల్లో కారు బాంబులతో విరుచుకుపడిన ముష్కరమూకలు 33 మందిని బలిగొన్నాయి. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు, ఎప్పటికప్పడు బాంబు దాడులతో విరుచుకుపడుతున్నారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకూ బాంబు దాడుల్లో 230 మంది వరకూ మరణించారు.