: ఎస్పీ, పూజాభట్ మధ్య 'బ్యాడ్' సంఘటన


రాజస్థాన్ లోని జైపూర్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలీవుడ్ నిర్మాత పూజాభట్ జిల్లా ఎస్పీతో తగవులాటకు దిగింది. విషయం ఏమిటంటే, కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే ఎస్పీ కార్యాలయం కూడా ఉంది. ఎస్పీ హరిప్రసాద్ శర్మ తన కార్యాలయానికి వెళుతుండగా పూజాభట్ 'బ్యాడ్' చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. యూనిట్ సభ్యులు షాట్ చిత్రీకరణకు వీలుగా అక్కడి స్థలాన్నంతా ఆక్రమించేశారు. మార్గం ఖాళీ చేయాలని ఎస్పీ కోరారు. దీంతో యూనిట్ సభ్యులు కొద్దిసేపు పక్కన నించోండని కోరారు. తాను ఎస్పీనని, షూటింగ్ కు అనుమతి లేకుండా తీయడానికి కుదరదని స్పష్టం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఎస్పీగారికి కోపమొచ్చింది. పందిరి పీకి పారేశారు. ఈ సందర్భంగానే పూజాభట్ కు ఎస్పీకి మధ్య తీవ్ర వాదులాట జరిగింది.

తర్వాత ఆమె కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎందుకొచ్చిన తంటా.. ఆమెకు క్షమాపణ చెప్పండి. షూటింగ్ కు అనుమతి ఉందని కలెక్టర్ సలహా ఇచ్చారు. తనకు తెలియకుండా అనుమతి ఇవ్వడంపై నోరెళ్లబెట్టడం ఎస్పీ వంతైంది. శాంతిభద్రతల బాధ్యత చూసేది పోలీసులు. కానీ వారికి తెలియకుండా అనుమతి ఇచ్చేశారు అధికారులు. 'ఎస్పీ ప్రవర్తన ఏమాత్రం బాలేదు. పబ్లిక్ హాలిడే రోజున షూటింగ్ చేసుకోకూడదా?' అని పూజాభట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News