: తెలుగు చానళ్లు డబ్బింగ్ సీరియళ్లను ప్రోత్సహించడం అన్యాయం: దాసరి
డబ్బింగ్ సీరియళ్లు తమ ఉపాధికి గండి కొడుతున్నాయని ఉద్యమ బాట పట్టిన తెలుగు టీవీ ఆర్టిస్టులకు సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు తన సంఘీభావం ప్రకటించారు. తెలుగు టీవీ పరిరక్షణ ఐకాస హైదరాబాదులో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు వాళ్ల కోసమంటూ ప్రారంభమైన చానళ్లు నేడు పరభాషా సీరియళ్లను ప్రోత్సహించడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా, వేల కుటుంబాలకు ఆధారమైన తెలుగు సీరియల్ పరిశ్రమను దెబ్బతీస్తున్న డబ్బింగ్ సీరియళ్లను నిలుపుదల చేసేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తానని దాసరి అన్నారు. తెలుగు టీవీ పరిశ్రమ ప్రతినిధులు చానళ్ల యాజమాన్యాలతో సామరస్య పూర్వకంగా చర్చించి సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని చెప్పారు.