: తెలంగాణ జిల్లాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా 91 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు పోలింగ్ ముగిసింది. కాగా, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో 84 శాతం.. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 83 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో అత్యల్పంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 33 శాతం మాత్రమే నమోదైంది. మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 36 శాతం, ఉభయ గోదావరి జిల్లాల్లో 40 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 25న నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News