: తాబేలు కు కొవ్వెక్కింది!
తాబేలుకి కొవ్వెక్కింది..! ఇదేమిటా అనుకుంటున్నారా? అవును, నిజమండీ.. ఆ తాబేలు నింపాదిగా కదులుతూ కొవ్వెక్కింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లోని రాయల్ నేషనల్ పార్క్ లోని ఓ తాబేలు బాగా బరువు పెరిగింది. ఊబకాయంతో బాధపడుతోంది. దీంతో దీన్ని పరీక్షలకోసం తరలించగా చర్మం కింద కొవ్వు పేరుకుపోయిందని వైద్యులు తెలిపారు, దీంతో దీన్ని వైద్యపరీక్షల కోసం తరలించడమే కష్టంగా మారింది. దీని బరువు తూచేందుకు జూ క్యూరేటర్లు ఓ చిట్కా కనిపెట్టారు. దీనికి అమితంగా ఇష్టమైన క్యారెట్ ఆశచూపి దీన్ని నడిపిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం, బరువు తూచేందుకని పలుమార్లు అటూఇటూ తిప్పుతున్నారు. త్వరలోనే దీని బరువు తగ్గడం ఖాయమని పార్క్ క్యూరేటర్ చెబుతున్నారు.