: వాచీల వ్యాపారానికి దేవుణ్ని వాడుకోవడమా..?: టీడీపీ నేత బొజ్జల
ఏడుకొండలవాడు శ్రీవెంకటేశ్వరుణ్ని వాచీల్లో ముద్రించి వ్యాపారానికి వాడుకోవడం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. వాచీల తయారీలో దేవుడి ప్ర్రతిమలు వినియోగించడం ఏం పద్ధతని ఆయన ప్రశ్నించారు.
వాచీల తయారీ కంపెనీకి టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం ఎలా అనుమతిస్తారంటూ బొజ్జల మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి విచారణ జరపాలని ఆయన కోరారు. దేవుడికి వ్యాపార విలువలు ఆపాదించడాన్ని ఖండిస్తున్నట్టు ఈ సందర్భంగా బొజ్జల తెలిపారు.