: పదుల ఏళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నా.. ఇంకా నిరుపేదలే!


ప్రజాప్రతినిధి అంటే సమాజంలో ఒక గుర్తింపు ఉంది. నలగని ఖద్దరు చొక్కా.. చుట్టూ వందిమాగధులు.. సలాములు.. డాంబీకాలు.. ఒకటేమిటి, అన్నీను. కానీ పదుల ఏళ్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నా వారు నిరుపేదలుగా మిగిలారు. గ్రామాలకు మంచి చెయ్యాలన్న తపనతో పదిమందికి ఆదర్శంగా నిలిచారు. కానీ, తమకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు. తాజా ప్రజాప్రతినిధులకు, వీరికి యోజనాల తేడా!

విశాఖపట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బోడమెట్టపాలెం గ్రామానికి చెందిన ముద్దాడ సూరప్పడు పదిహేనేళ్ళు పంచాయతీ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అతని భార్య అయ్యప్పమ్మ పదేళ్లు సర్పంచ్ గా పదవి నిర్వహించింది. సుమారు 25 ఏళ్లు పదవీబాధ్యతలు చేపట్టిన వీరు పూరింట్లో నివసిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన రాజయ్య నాలుగుసార్లు సర్పంచ్ గా ఎన్నికైనా నిరాడంబర జీవనమే గడుపుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం సర్పంచి మర్రి సూర్యారావు నాలుగు సార్లు సర్పంచ్ గా ఎన్నికైనా సంపాదించింది శూన్యం.

అదిలాబాద్ జిల్లా రాజంగుడికి చెందిన గట్టమ్మ తనకున్న పదెకరాల పొలాన్ని అమ్మి గ్రామానికి గుడి కట్టించింది. సర్పంచిగా ఉన్న కాలంలో గ్రామంలో లైటుపోయినా, రోడ్డు మరమ్మత్తు అయినా సరే ఆమే బాధ్యత తీసుకుంది. ఇప్పుడు తాను యజమానిగా ఉన్న పొలంలోకే పనికి వెళుతోంది. ఇప్పటి ప్రజాప్రతినిధులకు గతకాలం ప్రజా ప్రతినిధులకు ఎంత తేడా!

  • Loading...

More Telugu News