: భేటీలతో హోరెత్తించనున్న యూపీ సీఎం
రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాదు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ సాయంత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. అనంతరం ఆరు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అవుతారు. రేపు ఉదయం అల్పాహారం సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో భేటీ అయి పలు విషయాలపై చర్చిస్తారు. ప్రధానంగా, అఖిలభారత యాదవ మహాసభకు హాజరయ్యేందుకు ఆయన నగరానికి విచ్చేశారు.