: 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రభుత్వం
వరద ముప్పు గోదావరి జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరద తీవ్రత పెరిగే ప్రమాదం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది. తీవ్ర ముప్పు ఉన్న పలు గ్రామాల నుంచి 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. కాగా, గోదావరిలోకి వివిధ ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుండడంతో భద్రాచలం వద్ద నది ప్రమాదస్థాయిని మించి పరవళ్ళెత్తుతోంది.