: సీబీఐ.. కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థ అని తేటతెల్లమైంది: వెంకయ్యనాయుడు


సీబీఐ.. కాంగ్రెస్ పార్టీ జేబు సంస్ధగా మారిందని మరోసారి తేటతెల్లమైందని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బన్సల్, ములాయం సింగ్ యాదవ్ కేసులో సీబీఐ వ్యవహరించిన విధానంతో మరోసారి ఆ సంస్థ విశ్వసనీయత సందేహాస్పదమైందని విమర్శిచారు. ఇక, కస్టడీలో ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులు అన్న సుప్రీం వ్యాఖ్యలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. లేకుంటే రాజకీయ దుర్వినియోగం జరిగే అవకాశం ఉందన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా బీజేపీ 100 ర్యాలీలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News