: 7 గంటలు ప్రశ్నించినా రాబట్టింది ఏమీ లేదు: బన్సల్


తాను లంచం పుచ్చుకున్నాననడానికి ఆధారాలే లేవని మాజీ రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ అన్నారు. రైల్వే బోర్డులో కీలక పదవిని ఇప్పించేందుకు రైల్వే ఉన్నతాధికారి నుంచి బన్సల్ మేనల్లుడు లంచం పుచ్చుకుంటూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ వ్యవహారంలో తన పాత్ర కూడా ఉందంటూ ఆరోపణలు రావడంతో బన్సల్ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బన్సల్ ఒక ప్రైవేటు చానల్ తో మాట్లాడుతూ.. 'నేను లంచం తీసుకున్నాను అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సీబీఐ నన్ను 7 గంటల పాటు ప్రశ్నించింది. కానీ, ఏమీ రాబట్టలేకపోయారు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సీబీఐ వద్ద లేవు. ఈ స్కామ్ లో నాకు ఎలాంటి పాత్ర లేదు' అని బన్సల్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News