: ఇందిరాపార్కు వద్ద సమైక్యాంధ్ర నేతల అరెస్టు
ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు వచ్చిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పలువురు నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీనిపై సమైక్యంధ్ర పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో శాంతియుతంగా తమ నిరసనను తెలియజేసే హక్కు పౌరులెవరికైనా ఉంటుందని, తమ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారంటూ నినాదాలు చేశారు.