: సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న రాహుల్,ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 23న తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో పర్యటించనున్నారు. ఈ సమయంలో రాహుల్ తో పాటు సోదరి ప్రియాంక కూడా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారని, నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను సందర్శిస్తారని స్థానిక కాంగ్రెస్ నేత చంద్రకాంత్ దూబే తెలిపారు.