: ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని పూర్తిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలను పురస్కరించకుని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే తరలి వస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. మనిషి ఆకలిని తీర్చడానికి అవతరించిన శాకంబరీ దేవి కరవు నుంచి మానవులను విముక్తి చేస్తుందని, ఆకలి దరిచేరకుండా ఉండటానికి భక్తులు ఈ తల్లిని పూజిస్తారని చెబుతారు.