: ఇంగ్లండ్ ధాటికి చేతులెత్తేసిన కంగారూలు


యాషెస్ లో ఇంగ్లండ్ హవా కొనసాగుతోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు స్వాన్, బ్రెస్నన్ ధాటికి తాళలేకపోయింది. దీంతో ఆశావహంగా ప్రారంభమైన ఆసీస్ ఇన్నింగ్స్ నామమాత్రమైన స్కోరుకే పరిమితమైంది. కేవలం 128 పరుగులకే చేతులెత్తేసి, ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగుల ఆధిక్యాన్నిచ్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ షేన్ వాట్సనే (30).

ఇంగ్లిష్ బౌలర్లలో స్వాన్ 5 వికెట్లు తీసుకోగా, బ్రెస్నన్ 2 వికెట్లతో రాణించాడు. అనంతరం ఫాలో ఆన్ కు అవకాశమున్నా మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో, కుక్.. కంగారూలను ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్సింగ్స్ ప్రారంభించాడు. అయితే, సిడిల్ నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు సిడిల్ కే దక్కడం విశేషం. దీంతో లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇంగ్లండ్ 264 పరుగుల ఆధిక్యంలో ఉంది. రూట్ 18 పరుగులతోనూ నైట్ వాచ్ మన్ బ్రెస్నన్ పరుగులేమీ చేయకుండానూ క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News