: 'సడక్ బంద్'పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యానికి నిరసన గా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 24న తలపెట్టిన 'సడక్ బంద్'పై రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బెంగళూరు-హైదరాబాదు
మధ్య నిర్వహించనున్న బంద్ ను నిలిపివేయాలని కోరుతూ కర్నూలుకు చెందిన బీవీ
శ్రీనివాసులు అనే న్యాయవాది పిటిషన్ వేశారు.
సడక్ బంద్ వల్ల ప్రజా రవాణాకు భారీగా సమస్యలు తలెత్తుతాయనీ, అంబులెన్సుల వంటి అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందనీ, ప్రజలు సమస్యలకు గురవుతారని పిటిషనర్ తన వ్యాజ్యంలో వివరించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ జేఏసీలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.