: పాత మిత్రుడి మరణం పట్ల చంద్రబాబు సంతాపం
మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఎంపీ హరికృష్ణ, పలువురు టీడీపీ నేతలు ఆయన హఠాన్మరణానికి దిగ్భ్రాంతి చెందారు. ఎక్కువ రోజుల పాటు టీడీపీలో ఉన్న విద్యాధరరావు ఎన్టీఆర్ హయాంలోనూ, అనంతరం చంద్రబాబు పాలనలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.