: తమిళనాడు బీజేపీ నేత దారుణ హత్య


తమిళనాడు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ వి.రమేశ్ గత అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. 52 సంవత్సరాల రమేశ్ పై నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద కొంతమంది దుండగులు పదునైన ఆయుధాలతో దాడిచేసి దారుణంగా పొడిచారు. దాంతో, ఆయన అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా, తొమ్మిది నెలల కిందట బీజేపీకి చెందిన మెడికల్ వింగ్ సెక్రెటరీ డాక్టర్ వి.అరవింద్ ను కూడా ఓ ముఠా ఇలానే హత్య చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News