: షారూఖ్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' ఒకరోజు ఆలస్యం
షారూఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రంజాన్ పండుగ నాడు అంటే ఆగస్ట్ 9న చిత్రం విడుదల అవుతుంది. ఈద్ పండుగ రోజున విడుదల చేయాలనుకున్నామని, ఆ రోజున సెలవు దినం కనుక ఈ నిర్ణయం తీసుకున్నామని డిస్నీ-యూటీవీ డ్రిస్టిబ్యూషన్ విభాగం డైరెక్టర్ గౌరవ్ వర్మ తెలిపారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన యాక్షన్, కామెడీ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్' లో షారూఖ్, దీపిక పదుకొనె జంటగా నటించారు.