: డీఎస్సీ-2012 అభ్యర్ధులకు శుభవార్త


డీఎస్సీ-2012 లో ఉద్యోగాలు పొంది అనంతరం తిరస్కరణకు గురైన అభ్యర్ధులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను  ప్రకటించింది. సూపర్ న్యూమరీ కోటా కింద ఉద్యోగాల భర్తీకి అవకాశం ఇస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథి గురువారం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 956 మంది నిరుద్యోగులు లబ్ది  పొందుతారని చెప్పారు.

మరో పదిరోజుల్లో డీఎస్సీ-2012 తిరస్కరణ అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. మొదట ఉద్యోగాలకు తీసుకున్న సర్కారు తర్వాత వారిని తిరస్కరించడంతో పలువురు అభ్యర్ధులు ఆవేదన చెందారు. ఇప్పుడీ నిర్ణయంతో వారిలో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. 

  • Loading...

More Telugu News