: మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కన్నుమూత


మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు గుండెపోటు కారణంగా ఆకస్మికంగా మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఆయన నివాసం నుంచి పంచాయతీ ఎన్నికల కోసం కామవరపు కోట మండలానికి వెళ్లేందుకు కారు ఎక్కబోతుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణం విడిచారు. ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న కోటగిరి తన రాజకీయ జీవితంలో అధిక కాలం టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ స్థాపించిన దగ్గరి నుంచీ 2008 వరకూ అందులోనే పనిచేశారు. ఎన్టీఆర్ కేబినెట్ లో వ్యవసాయ మంత్రిగా, తర్వాత చంద్రబాబు కేబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించి తనదైన ముద్ర వేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడంతో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు.

కోటగిరి విద్యాధర్ రావు ఐదుసార్లు చింతలపూడి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో అనివార్యంగా కాంగ్రెస్ లోనే కొనసాగాల్సి వచ్చింది. ఆయన ఆశించిన మేర కాంగ్రెస్ లో గుర్తింపు కూడా రాలేదు. ఆయన మరణం ప్రముఖ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

  • Loading...

More Telugu News