: తగ్గని గోదావరి ఉద్ధృతి... జలదిగ్బంధంలో 130 గ్రామాలు
గోదావరి భీకరంగా ఉరకలెత్తుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద ఈ ఉదయం 57 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. రామాలయం పరిసరాల్లోని దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మరోవైపు, డివిజన్ లోని 130 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని భద్రాచలం సబ్ కలెక్టర్ రజత్ కుమార్ గుప్తా చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, మధ్యాహ్నానికి వరద తగ్గుముఖం పట్టవచ్చని తెలిపారు. తాజా పరిస్థితిని ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి బాలరాజు.. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.