: 'అత్తారింటికి దారేది' పాటల వేడుక షురూ
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న 'అత్తారింటికి దారేది' చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం మొదలైంది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవర్ స్టార్ సరసన సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఈ సినిమా విడుదల కానుంది.